అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
టికెట్ ధరల పెంపు: కోర్టులో ప్రజా వ్యాజ్యం
సినిమాల టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అధిక ప్రదర్శనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు ఈ పిల్ ద్వారా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేశారు.
‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ చిత్రాలపై వివాదం
రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలకు అధిక టికెట్ ధరలను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని పెద్ద సినిమాలకు అనుమతించినట్టే ఉన్నా, ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో సంబంధించిన సినిమాలకు ప్రయోజనం కల్పించడానికి తీసుకున్నదేనని పిటీషనర్ కోర్టుకు వాదనలు వినిపించారు.
టికెట్ ధరల పరిమితిపై హైకోర్టు ఆదేశాలు
హైకోర్టు ధర్మాసనం, టికెట్ ధరల పెంపును కేవలం 10 రోజులకు పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని, ప్రస్తుతం ఈ సినిమాలకు అవే నిబంధనలు వర్తిస్తాయని న్యాయస్థానం తెలిపింది.
బెనిఫిట్ షోలు – వివాదస్పద అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం వాటికి అనుమతులు ఇచ్చింది. రోజుకు ఐదు లేదా ఆరు షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా, వేళ కాని వేళల్లో బెనిఫిట్ షోలను నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించింది.
కుట్ర కోణం
ఈ పిల్ రాజకీయ ప్రేరేపితమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పుష్పా 2 వంటి చిత్రాలకు కూడా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు, అప్పట్లో పిల్ ఎందుకు దాఖలు కాలేదని పదునైన ప్రశ్న సంధిస్తున్నారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు
‘గేమ్ చేంజెర్’ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్ళివస్తూ ఇద్దరు కుర్రాళ్లు చనిఫ్యారని పిటీషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనలకు స్పందిస్తూ, హైకోర్టు ధర్మాసనం, “శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలు చూడడానికి వెళ్ళివస్తూ ఎవరికో ప్రాణ నష్టం జరిగిందని వాటిని నిలిపివేయాలని అభ్యర్థించటం సరైనది కాదు” అంటూ వ్యాఖ్యానించింది.
ప్రధానంగా పిటిషన్ అంశాలు
- ప్రభుత్వానికి టికెట్ ధరల పెంపుతో జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం పేర్కొనగా, దీనికి పిటీషనర్ వ్యతిరేక వాదనలు వినిపించారు.
- వేళ కాని వేళల్లో బెనిఫిట్ షోల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిలిపివేయాలని పిటీషనర్ విజ్ఞప్తి చేశారు. వేళా కాని వేళల్లో ప్రజల ప్రయాణాలని అడ్డులేమని ప్రభుత్వ వాదన.
వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో
టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై ఈ వివాదం మరింత పెద్దదవుతోంది. ఈ అంశంపై హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయాలు పరిశ్రమలో కీలక ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.