fbpx
Sunday, September 8, 2024
HomeTelanganaతెలంగాణ బీఆర్ఎస్‌లపై స్టే కొనసాగింపు

తెలంగాణ బీఆర్ఎస్‌లపై స్టే కొనసాగింపు

HIGHCOURT-EXTENDS-STAY-ON-LRS-BRS-IN-TELANGANA

హైదరాబాద్‌: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మళ్ళీ చుక్కెదురైంది. బీఆర్ఎస్‌లపై విధించిన స్టేను యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై బుధవారం హైకోర్టు విచారణ చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో, అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా అప్పటివరకూ అర్జీదారులను ఇబ్బందులకు గురిచేయ వద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్‌ కాపీ ప్రతులను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్‌ చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పున: పరిశీలించింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చే తుది ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్‌పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది.

ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్‌ను హైకోర్టు నమోదు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular