అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు నూతనంగా ఏదుగురు న్యాయమూర్తులు నియమించబడ్డరు. కాగా ఆ ఏడుగురు న్యాయమూర్తులచే ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.
అమరావతిలో ఉన్న హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా నియముతులైన న్యాయమూర్తులు జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.