న్యూఢిల్లీ: వాట్సాప్‌కు 2021 కొతా ఏడాది ఏ రకంగాను అచ్చుబాటు కావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమవుతునే ఉంది. వాట్సాప్ కు ప్రధాన పోటీదారులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి.
జనవరి 2021లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన నాన్-గేమింగ్ యాప్స్‌లో టెలిగ్రాం అన్నిటికంటే ముందు ఉంది. ఈ విషయాన్ని సెన్సార్ టవర్ అనే ఒక డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. అంతే కాక టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్‌లోడ్ చేసిన వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. టెలిగ్రాం యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
భారతదేశం నుంచే ఏకంగా 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్‌లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్‌లోడ్ చేసుకున్నారు. డౌన్‌లోడ్‌లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలే. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్‌కు మారారు.