టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హిమజ కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ అమ్మాయి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ అంచలంచెలుగా ఎదిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించి ఇపుడు హీరోయిన్ గా ఒక సినిమాతో రాబోతోంది. ఈరోజు తాను ప్రధాన పాత్రలో నటింస్తున్న ‘జ’ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ని తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. హిమజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ హర్రర్ సినిమా ఫస్ట్ లుక్ ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
హిమజ లీడ్ రోల్ పోషిస్తున్న ‘జ’ చిత్రానికి సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నాడు. సైదిరెడ్డికి దర్శకుడిగా ఇదే తొలిచిత్రం. ఈ సినిమాను జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్నారు.హిమజ ఇదివరకే ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసి భయపెట్టింది. ఇపుడు మరొకసారి ఇంకొక హారర్ సినిమాలో ప్రధాన పాత్ర ద్వారా మన ముందుకు రాబోతుంది.