fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsవివాదాల్లో హిందీ అపరిచితుడు

వివాదాల్లో హిందీ అపరిచితుడు

Hindi Aparichutudu InNewsJustAfterAnnouncement

బాలీవుడ్: నిన్ననే హిందీ లో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు సినిమాని రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ శంకర్ షణ్ముగం. ఈ రోజు ఈ ప్రకటన ఒక వివాదానికి కారణమైంది. అపరిచితుడు ని తమిళ్ లో నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని ఎవరి పర్మిషన్ తీసుకొని రీమేక్ చేస్తున్నావ్, నిర్మాత గా ఆ సినిమా హక్కులు తనవి అని తనని అడగకుండా ఆ సినిమా రీమేక్ చేసే హక్కు లేదని, దీని పై లీగల్ గా వెళ్తానని ఒక నోట్ విడుదల చేసాడు.

దీనికి డైరెక్టర్ శంకర్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. ఆ సినిమాకి కథ తన సొంతంగా రాసానని, కావాలంటే సినిమా టైటిల్స్ లో కథ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఎవరి పేర్లున్నాయి చూసుకోమ్మన్నాడు. అంతే కాకుండా తాను ఎక్కడ కూడా కథ మీదే అని రైట్స్ రాసివ్వలేదు. ఆ సినిమా అప్పుడు నిర్మించినందుకు మీకు లాభాలొచ్చాయి. నా పైన, నా కథ పైన మీ అజమాయిషీ ఇక చెల్లదు. ఈ కథ పైన నాకు అన్నీ హక్కులున్నాయి, నేను ఎక్కడైనా ఈ కథని డెవలప్ చేసుకొని సినిమాలు తియ్యవచ్చు. ఈ క్లారిటీ తర్వాత మీలో మంచి అభిప్రాయం కలుగుతుందని ఆశిస్తున్నాను.

ఈ మధ్య శంకర్ కి ఆశించినంత సక్సెస్ రాకపోవడం తో పాటు ఇలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి. భారతీయుడు సినిమా షూట్ మొదలైనప్పటి నుండి అటు నిర్మాతలతో ఒక వివాదం, ఆ తర్వాత క్రేన్ ఆక్సిడెంట్ అవడం ఇలా ఎదో ఒక వివాదం నడుస్తూనే ఉండి ఇపుడు ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా పూర్తి చేసి 2022 లో అపరిచితుడు రీమేక్ షూట్ మొదలు పెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular