
నేచురల్ స్టార్ నాని మరోసారి తన యాక్షన్ అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా విడుదలైన హిట్ 3 టీజర్‌లో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తెల్లటి సూట్, బ్లాక్ బో టైతో కత్తి పట్టుకుని విలన్లను చిత్తు చేసే లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్‌లో కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్, టెర్రర్ ఎలిమెంట్స్, మర్డర్ మిస్టరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాని సీరియస్ లుక్, ఆగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, హై ఇంటెన్సిటీ డైలాగ్స్ టీజర్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాయి.
దర్శకుడు శైలేష్ కొలను ఈసారి హిట్ ఫ్రాంచైజ్‌ను మరింత బలంగా, యాక్షన్ మోడ్‌లోకి తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. టీజర్‌లో హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్సులు థ్రిల్ కలిగిస్తున్నాయి.
ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ సినిమాను మే 1న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. హిట్ 3 టీజర్‌లో చూపించినంతకు మించి సినిమా ఇంకా వయలెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుందని నాని అభిమానులు అంచనా వేస్తున్నారు.