టాలీవుడ్: కెరీర్ ప్రారంభం నుండి మూస సినిమాలు కాకుండా వైవిద్యం చూపిస్తూ ఒక్కో సినిమాకి మంచి కథతో వస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగా హీరోల్లో సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు వరుణ్. వరుణ్ తేజ్ హీరోగా కెరీర్ లో 10 వ సినిమాగా ‘గని’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ అవతారం ఎత్తనున్నాడు. ఈ సినిమా కోసం ఫీజికల్ గా కూడా వరుణ్ బాగానే ట్రైన్ అవుతున్నాడు.
ఈ సినిమాకి సంబందించిన ఒక ప్రకటన ఈ రోజు వెలువడింది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ బాక్సింగ్ స్టేడియం సెట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నారు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్ మరియు వ్లాడ్ రిమ్బర్గ్ లని ఎంచుకున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమా కోసం పని చేసిన వీళ్ళు తెలుగులో పని చేయడం ఇదే మొదటిసారి. అల్లు అరవింద్ సమర్పణలో రెసోనెన్స్ ఫిలింస్ – అల్లు బాబీ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు బాబీ మరియు సిద్ధు ముద్ద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ పూర్తవగానే మిగతా భాగం పూర్తి చేసి విదాలకి రెడీ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు.