టాలీవుడ్: తెలుగు నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో RRR సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్ఠీఆర్ కాంబినేషన్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల పేర్లతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ప్రతి చిన్న అంశాన్ని తేలికగా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడు జక్కన్న రాజమౌళి.
ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నిషియన్ ని రంగంలోకి దించారు రాజమౌళి. హాలీవుడ్ సినిమాలు గ్లాడియేటర్, మమ్మీ, బ్రేవ్ హార్ట్ అలాగే మన ఇండియన్ సినిమాలైనా రోబో 2 మరియు మని కర్ణిక సినిమాలకి యాక్షన్ డైరెక్టర్ గా పని చేసిన నిక్ పావెల్ RRR సినిమాకి పని చేస్తున్నారు. RRR క్లైమాక్స్ షూట్ పూర్తి చేసి షూటింగ్ పార్ట్ ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని RRR టీం ఎదురు చూస్తుంది. అక్టోబర్ 13 న విడుదల తేదీ ని ఫిక్స్ చేసిన సినిమా టీం ఎట్టి పరిస్థితుల్లో అదే రోజున విడుదల చేయడానికి చాలా కష్టపడుతుంది.