కూకట్‌పల్లి: హైడ్రా: మూసాపేట సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీ హెచ్ఐజీ-53లో నివాసముంటున్న నారాయణ కుటుంబం శనివారం తీవ్ర దుస్థితికి గురైంది. 268 గజాల స్థలంలో గృహ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుండి స్టిల్‌ప్లస్-3కి అనుమతి పొందిన ఈ కుటుంబం, అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించి అద్దెకిచ్చారు.
ఐదో అంతస్తులో ఉన్న 502 ఫ్లాట్‌లో నివసిస్తున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతికి వెళ్లగా, అదే సమయంలో అధికారుల పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ సిబ్బంది హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ ఇంటిని కూల్చివేశారు.
ఈ అనూహ్య ఘటనలో ఫ్లాట్‌లోని ఏసీ, ఫ్రిడ్జ్, సోఫా సహా ఇతర సామగ్రి ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఇంటిని కూల్చివేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఇల్లు కూల్చివేతకు సంబంధించి ముందు సమాచారం లేకపోవడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లు కూల్చివేతకు ముందుగా నోటీసులు ఇవ్వకపోవడం బాధిత కుటుంబం నిరాశతో పాటు ఆవేదనకూ గురి చేసింది. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరేలోపు ఇల్లు కనపడకపోవడం ఆ కుటుంబానికి పెద్ద మానసిక షాక్‌గా మారింది.