fbpx
Tuesday, January 7, 2025
HomeMovie Newsడాకు మహారాజ్.. బాలయ్య టార్గెట్ ఎంతంటే?

డాకు మహారాజ్.. బాలయ్య టార్గెట్ ఎంతంటే?

HOW-MUCH-IS-TARGET-FOR-DAKU-MAHARAJ
HOW-MUCH-IS-TARGET-FOR-DAKU-MAHARAJ

మూవీడెస్క్: సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మీద అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

బాలయ్య ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. విడుదలైన ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 83 కోట్లు అయినట్లు సమాచారం. అంటే హిట్ కావాలంటే 84 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా ‘డాకు మహారాజ్’ నిలవడం విశేషం.

ఈ సినిమాతో షేర్ పరంగా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంక్రాంతి బరిలో బాలయ్యకు మంచి సెంటిమెంట్ ఉన్నందున ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా నటించగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

జనవరి 12న గ్రాండ్‌గా విడుదల అవుతుంది. మరి ఈ సినిమా బాలయ్యకు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular