ఏపీ: రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ మౌనవ్యవహారం ప్రశ్నార్ధకంగా మారుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం, మీడియాకు కనీసం స్పందించకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చలు, సమస్యలపై వైసీపీ మౌనం ప్రజల్లో కూడా విమర్శలకు దారితీస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలోనూ వైసీపీ ఎంపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం.
లోక్‌సభలో వైసీపీకి ఉన్న 4 మంది ఎంపీలు, రాజ్యసభలో ఉన్న 9 మంది సభ్యులు ఎలా వ్యవహరించాలనే దిశగా జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం ఆశ్చర్యకరం.
అంతే కాకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే తమ ఎంపీలకు దిశానిర్దేశం చేయగా, జగన్ మాత్రం పార్టీకి సపోర్టు ఇచ్చే కీలక సమయంలో చురుగ్గా కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇదిలావుంటే, పార్లమెంటు సమావేశాల్లో అదానీ లంచాల వ్యవహారం, పోలవరం నిధులు, అమరావతి నిధులు వంటి అంశాలు హాట్ టాపిక్‌గా మారనున్నాయి.
ప్రతిపక్షాలు జగన్ లంచాల అంశంపై నిలదీయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీలు సత్వర చర్చలకు సిద్ధం కాకపోవడం పార్టీ పట్ల అవిశ్వాసం పెంచేలా ఉంది.