హృతిక్ మాటలే ప్రూఫ్: బాలీవుడ్‌లో తారక్ డామినేషన్ స్టార్ట్!
జూనియర్ ఎన్టీఆర్ నటనపై ఇప్పుడు బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ప్రత్యేకంగా హృతిక్ రోషన్ ఇటీవల ఓ ఈవెంట్‌లో తారక్ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫేవరెట్ కోస్టార్ ఎవరన్న ప్రశ్నకు హృతిక్ ఆలస్యం చేయకుండా “జూనియర్ ఎన్టీఆర్” అని చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఇద్దరూ కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తారక్‌కు బాలీవుడ్‌లో కీలక ఎంట్రీ కావడమే కాదు, నేషనల్ రేంజ్‌లో డామినేట్ చేసే అవకాశం కూడా. హృతిక్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేయడం తారక్‌కు మెగా లెవెల్ స్టెప్.
హృతిక్ తారక్ గురించి “అమేజింగ్, గ్రేట్ టీమ్‌మేట్” అంటూ చెప్పడం చూస్తే… వార్ 2 సెట్స్‌లో తారక్ తన టాలెంట్‌ను పూర్తిగా చూపించినట్లు అర్ధమవుతోంది. నెగటివ్ షేడ్‌లో కనిపించనున్న తారక్, స్క్రీన్‌పైన హృతిక్‌ను డామినేట్ చేస్తాడన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది.
రీసెంట్‌గా వార్ 2 ఆగస్ట్ 14న రాదని గాసిప్స్ వెలువడగా, హృతిక్ వాటిని ఖండిస్తూ అదే తేదీన సినిమా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇది తారక్ ఫ్యాన్స్‌కి అదనపు ఎనర్జీ ఇచ్చింది. ఫ్యాన్స్ మాటల్లోనే చెప్పాలంటే.. ఇది తారక్ బాలీవుడ్ డెబ్యూ కాదు, డామినేషన్ స్టార్ట్!