జాతీయం: కోల్ ఇండియా నుండి 434 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది
ఇంజినీరింగ్, ఎంబీఏ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) నుండి మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంబీఏ, సీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది ఓ గోల్డెన్ అవకాశం. మొత్తం 434 ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో వివిధ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- కమ్యూనిటీ డెవలప్‌మెంట్: 20
- ఎన్విరాన్‌మెంట్: 28
- ఫైనాన్స్: 103
- లీగల్: 18
- మార్కెటింగ్: 25
- మెటీరియల్స్ మేనేజ్‌మెంట్: 44
- పర్సనల్ హెచ్‌ఆర్: 97
- సెక్యూరిటీ: 31
- కోల్ ప్రిపరేషన్: 68
దరఖాస్తు ప్రాసెస్
- ప్రారంభ తేదీ: 15 జనవరి 2025
- చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6 గంటలలోపు
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2025
అప్లికేషన్ ఫీజు:
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: ₹1180
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు: ఫీజు మినహాయింపు
అర్హతలు & వయోపరిమితి
- అభ్యర్థులు బీటెక్, ఎంబీఏ, సీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి 30 సంవత్సరాలు.
ఎంపిక విధానం
మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- పరీక్ష పేపర్లు:
- జనరల్ నాలెడ్జ్
- ప్రొఫెషనల్ నాలెడ్జ్
- ఒక్కో పేపర్ 100 మార్కులు ఉంటుంది.
- పరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
పరీక్ష తర్వాత:
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
అప్లై చేయడం ఎలా?
అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.