fbpx
Saturday, November 23, 2024
HomeTelanganaతెలంగాణలో భారీ ఫార్మా పెట్టుబడులు

తెలంగాణలో భారీ ఫార్మా పెట్టుబడులు

Huge Pharma Investments in Telangana

తెలంగాణ: తెలంగాణలో భారీ ఫార్మా పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ ఫార్మా విలేజ్‌ ప్రాజెక్ట్‌లో రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 6 ప్రధాన ఫార్మా సంస్థలు ముందుకొచ్చాయి.

ఈ ప్రాజెక్ట్‌లో ఏర్పాటవుతున్న యూనిట్ల ద్వారా కాలుష్య రహిత విధానంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా శుక్రవారం ఆరు ఫార్మా దిగ్గజాలు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఎస్‌ఎన్‌ గ్రూప్, లారస్‌ ల్యాబ్స్, గ్లాండ్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా సంస్థల ప్రతినిధులు వారి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎంవోయూలపై సంతకాలు చేశారు.

ప్రభుత్వం ఫార్మా విలేజ్‌ కోసం ఇప్పటికే గుర్తించిన స్థలాన్ని ఈ కంపెనీలకు కేటాయించనుంది.

ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో పాటు ఆర్‌అండ్‌డి సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది.

లారస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మాలు కొత్త ఫార్ములేషన్‌ యూనిట్లను నెలకొల్పుతాయి.

గ్లాండ్‌ ఫార్మా ఆర్‌అండ్‌డి సెంటర్‌తో పాటు ఇంజెక్టబుల్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను నిర్మించనుంది.

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ ఇంజెక్టబుల్‌, బయోసిమిలర్స్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్‌ ఫినిష్డ్‌ డోస్‌, ఇంజెక్టబుల్స్‌ తయారీ పరిశ్రమను స్థాపించనుంది.

మరో నాలుగు నెలల్లో ఈ ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించేలా అవసరమైన సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ సతీశ్ రెడ్డి, లారస్‌ ల్యాబ్స్‌ ఈడీ వీవీ రవికుమార్, గ్లాండ్‌ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, అరబిందో డైరెక్టర్‌ మదన్‌మోహన్ రెడ్డి, హెటిరో గ్రూప్‌ ఎండీ బి.వంశీ కృష్ణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular