ఢిల్లీ: ఐపీఎల్ ను కరోనా నీడ వదిలిపెట్టట్లేదు. కొందరి ప్లేయర్లకు పాజిటివ్ రావడంతో ఉన్న పలంగా ఐపీఎల్ 2021ను నిరవధికంగా వాయిద వేసింది బీసీసీఐ. కాగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) యొక్క బ్యాటింగ్ కోచ్ అయిన మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాజాగా శనివారం ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కరోనా నెగెటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. కాగా వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలో అతనికి తాజాగా మంగళవారం రోజున మళ్లీ కరోనా పాజిటివ్ గ్ రావడంతో మరికొన్ని రోజులు మైఖెల్ హస్సీ భారత్‌లోనే ఉండాల్సి పరిస్థితి నెలకొంది.
ఆసీస్ మాజీ ఆటగాడు అయిన హస్సీ ప్రస్తుతం చెన్నై నగరంలోని ఒక హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. హస్సీతో పాటు చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్‌కు మే 3న కరోనా వైరస్ సోకింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా, మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.