హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికా దేశంలోని అన్నింటికంటే ఎత్తయిన పర్వతమయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహణ చేసింది. ఈ నేపథ్యంలో పులకిత హస్వి మాట్లాడుతూ, ఇది ఒక సాహసోపేతమైన అనుభవం. కిలిమంజారో పర్వతం అధిరోహించే వారు దాని పై ఉన్న అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది.
అంతేకాక ఈ సంవత్సరం మొదలు ఏప్రిల్‌లో జరిగిన ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ముందు మూడు నెలల నుంచే ఈ పర్వతారోహణకు సన్నద్ధం కావాల్సి ఉందని తెలిపింది. అలాగే ఇలంటి పర్వతారోహణకు వెళ్ళాలంటే ముణ్దు మానసికంగా దృఢంగా ఉండాలి.
వీటి కోసం యోగా, మెడిటేషన్ వంటివి చేసేదాన్నని తెలిపింది. తాను 2024 సంవత్సరానికి ముందు మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలని సంకల్పించుకున్నట్ల్లు అందుకోసం నేను ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను. ” అని పులకిత హస్వి చెప్పింది.