హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లీ దూసుకెళ్తోంది. దేశంలో పెద్ద నగరాలైన ముంబై, బెంగళూరులను తలదన్నే వృద్ధి కనబరుస్తోంది. ఇటీవల తెలంగాణ రాజధానిక్ హైదరాబాద్ లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ సంక్షోభం మొదలైనప్పటి నుంచి యావత్ దేశంలో ఆర్థిక రంగం దెబ్బతినింది. ఆదాయాలు పడిపోవడంతో ప్రజలు భారీ ఖర్చులు చేసేందుకు వెనుకాడారు. 2021 మార్చిలో మొదలైన కోవిడ్ సెకండ్ వేవ్ ఇంచుమించు జూన్ చివరి వరకు కొనసాగింది. దాని తరువాతే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడ్డాయి.
ఈ ఏడాది జులై, ఆగష్టు, సెప్టెంబరులకు సంబంధించిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో రియాల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంది. రియల్ ఎస్టేట్ వృద్ధి రేటులో ముంబై లాంటి మహానగరాన్ని కూడా హైదరాబాద్ వెనక్కి నెట్టేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హైదరాబాద్ నగర పరిధిలో 6,735 ఇళ్లు అమ్ముడయ్యాయి.
కాగా ఇళ్ల అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్, ముంబైల తర్వాత స్థానంలో చెన్నై 113 శాతం, పూనే 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ నాలుగు నగరాలు వంద శాతం వృద్ధిరేటుతో ఉండగా కోల్‌కతా నగరం మాత్రం కొంచెం వెనుకబడి 99 శాతం , నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ) 97 శాతం వృద్ధిని కనబరిచాయి. మెట్రోపాలిటన్ సిటీస్‌లోనే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేరుపడిన బెంగళూరులో అమ్మకాలు కేవలం 58 శాతమే పెరిగాయి.9