fbpx
Sunday, November 24, 2024
HomeInternationalతొలిసారి ప్రయాణికులతో హైపర్ లూప్ ప్రయోగం

తొలిసారి ప్రయాణికులతో హైపర్ లూప్ ప్రయోగం

HYPERLOOP-FIRST-JOURNEY-WITH-PASSENGERS

వాషింగ్టన్‌ : అమెరికా లాస్‌ వెగాస్‌ నగరంలో రిచర్చ్‌ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్‌ గ్రూప్‌ ఆదివారం నాడు హైపర్‌ లూప్ రైలును (కృత్రిమ సొరంగ మార్గం గుండా అతివేగంగా నడిచే రైలు) తొలిసారి ప్రయాణికులతో నడిపి అందులో విజయం సాధించింది. అంతకు ముందు దాదాపు 400 సార్లు ట్రయల్స్‌ను నిర్వహించిన ఈ సంస్థ ప్రయాణికులతో నడపడం మాత్రం ఇదే మొదటిసారి.

చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జోష్‌ జోజెల్, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సారా లుచియాన్‌ తొలి ప్రయాణికులుగా ప్రయాణించారు. ప్రయాణికులు కూర్చొని వెళ్లే రైలును ప్రస్తుతం సైన్స్‌ పరిభాషలో ‘లెవిటేటింగ్‌ పాడ్‌’ అని, రైలు మార్గాన్ని ట్యూబ్‌ అని వ్యవహరిస్తున్నారు.

ఈ రైలుకు గంటకు 600 మైళ్ల వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయాణికులతో నడపడం తొలిసారి కనుక గంటకు వంద మైళ్ల వేగంతో రైలును నడిపారు. ఆ రైలు 15 సెకండ్లలో 0.3 మైళ్లు, అంటే 500 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అత్యద్భుతమైన హైపర్‌లూప్‌ టెక్నాలజీని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు తమ వర్జిన్‌ గ్రూప్‌ విశేషంగా కృషి చేస్తోందని గ్రూప్‌ వ్యవస్థాపకులు పర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular