వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో భైడెన్ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడానికి సన్నాహలు చేసుకునటున్నారు. అయితే అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బను ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించేదే లేదని చెబుతున్న ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక వైపు జో బైడెన్ గెలిచినట్టు అంగీకరిస్తూనే, అధ్యక్ష పీఠం కోసం మోసాలకు పాల్పడుతున్నారంటూ వాపోయిన ట్రంప్ తాజాగా తానే గెలిచానంటూ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఐ వన్ ది ఎలక్షన్’ అంటూ ఆయన సోమవారం ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ట్వీట్‌ను ట్విటర్ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రింద ఒక హెచ్చరిక జారీ చేయడం కొసమెరుపు.
ట్రంప్ ను ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. తాజా ఎన్నికల ప్రకారం అమెరికా పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్టు స్పష్టమవుతోందనీ, ట్రంప్ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీన పడిందని భావిస్తాయన్నారు.
తమ నాయకుడు జో బైడెన్ చేతిలో ట్రంప్ చిత్తుగా ఓడిపోయారని డెమొక్రాటిక్ వర్గాలు సంబరాల్లో ముగిని తేలుతున్నసంగతి తెలిసిందే. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం, స్టేట్-బై-స్టేట్ ఎలక్టోరల్ సిస్టంలో బైడెన్ 306 ఓట్లను గెల్చుకున్నారు.