అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇందులో ప్రముఖంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్.జవహర్‌రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఆయన టీటీడీకి ఈవో గా ఉన్నారు, ఆయనకు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనతో పాటు రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులను జారీ చేశారు.
బదీలీ అయిన ఐఏఎస్ ల వివరాలు:
పేరు | ప్రస్తుత స్థానం | బదిలీ స్థానం |
నీరబ్ కుమార్ ప్రసాద్ | చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) | ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ |
కె.ఎస్. జవహర్ రెడ్డి | జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి | టీటీడీ ఈవో గా కొనసాగింపు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి |
జి. సాయి ప్రసాద్ | ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, క్రీడలు, యువజన సేవ, టూరిహం సేవలు | చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) |
రజత్ భార్గవ | ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, (ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) | ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, (ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) తో పాటు క్రీడలు, యువజన సేవ, టూరిహం సేవలు |
శశిభూషన్ కుమార్ | ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ(హెచ్ఆర్) | ముఖ్య కార్యదర్శి గా కొనసాగింపు, జలవనురల శాఖ, జీఏడీ( సర్వీసెస్) |
జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్ | ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ | సభ్య కార్యదర్శి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాలికా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగింపు |
ఎం.టి. కృష్ణ బాబు | ముఖ్య కార్యదర్శి, రవాణ, రోడ్లు, భవనాలు అదనపు బాధ్యతలు | ప్రస్తుత స్థానంతో పాటు రవాణా శాఖ కమీషనర్ |
బాబు. ఏ | ఎం డీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎఫ్) | ప్రస్తుత స్థానంతో పాటు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు! |