దుబాయ్: ఇటీవలే న్యూజిలాండ్ మొదటి ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రెండవ సీజన్ యొక్క షెడ్యూల్, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని తాజాగా ప్రకటించింది.
ఇకపై టెస్ట్ సిరీస్ లెంత్‌తో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే టీం సాధించిన పాయింట్ల శాతం ఆధారంగా ఆయా జట్లకు ర్యాంకులు కూడా ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది.
అయితే మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీని కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
నూతన విధానంలో సిరీస్‌లోని మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కేటాయించే పాయింట్ల వివరాలు:
2 మ్యాచ్‌ల సిరీస్- 24 పాయింట్లు
3 మ్యాచ్‌ల సిరీస్- 36 పాయింట్లు
4 మ్యాచ్‌ల సిరీస్- 48 పాయింట్లు
5 మ్యాచ్‌ల సిరీస్- 60 పాయింట్లు కేటాయిస్తారు.