2025లో పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై నెలకొన్న అభ్యంతరాలకు హైబ్రిడ్ మోడల్ ద్వారా పరిష్కారం లభించింది.
భారత్ భద్రతా కారణాల వలన పాకిస్థాన్‌కి వెళ్లకూడదని నిర్ణయించడంతో, టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ఆశలపై నీళ్ళు పోసినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అంగీకరించింది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం, ఇతర జట్ల మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి.
భారత మ్యాచ్‌లు దుబాయ్‌కి మళ్లించడం పీసీబీకి ఆర్థికంగా నష్టమే. అయితే, 2027లో పీసీబీకి ఐసీసీ మహిళల టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది.
ఈ టోర్నమెంట్‌లో భారత్ – పాక్ మ్యాచ్‌కు దుబాయ్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇది టోర్నమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఫిబ్రవరి 19న టోర్నమెంట్ ప్రారంభమవుతుంది, ఎనిమిది జట్లు పోటీపడతాయి. భారత్ – పాక్ మధ్య మ్యాచ్ మరోసారి క్రికెట్ ప్రపంచానికి కిక్కిస్తుందనడంలో సందేహం లేదు.