fbpx
Thursday, November 21, 2024
HomeSportsఛాంపియన్స్ ట్రోఫీ: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం

icc-champions-trophy-controversy-bcci-pcb-hybrid-model

ఢిల్లీ: భారత్ పాకిస్థాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుందా లేదా అన్న ప్రశ్న ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టంగా ప్రకటించింది.

అయితే ఈ టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌ను సూచించింది, దీని ప్రకారం భారత్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాల్సి ఉంటుంది.

ఐసీసీ ఇప్పటికే ఈ ప్రతిపాదనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) తెలిపినా, పీసీబీ స్పందించలేదు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భారత్ షరతుల్ని అంగీకరించకూడదని సవాలు విసిరింది.

“మా దేశం నుంచి ఒక్క మ్యాచ్ కూడా బయట జరగకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకపోతే, టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ పరిణామాలు క్రికెట్ ప్రపంచంలో సవాళ్లను మిగులుస్తున్నాయి. భారత పాకిస్థాన్ వివాదం ముగిసే వరకు టోర్నమెంట్‌పై సందిగ్ధత కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular