సంగారెడ్డి: తెలంగాణ సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు ఒక కీలకమైన్ ముందడుగు వేసింది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఒక భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ సోమవారం ఈ భారీ టెలిస్కోప్‌ను ప్రారంభించారు.
కాగా ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్ తర్వాత రెండోది) ఆప్టికల్ వ్యాసం కలిగిన ఈ భారీ లెన్స్ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన తమ ప్రకటనలో తెలిపింది. చంద్రుడిపై చిన్న క్రేటర్‌లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను దీని ద్వారా నమోదు చేసేందుకు వినియోగించొచ్చని తెలిపింది.
ఖగోళ విషయాలపై రీసర్చ్ చేసే విద్యార్థులకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ మూర్తి తెలిపారు. స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని అన్నారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ ఆ్రస్టానమీ క్లబ్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు.