టాలీవుడ్: అప్పుడప్పుడు మన తెలుగు సినిమాల్లో కొన్ని చిన్న సినిమాలు వచ్చి స్పెషల్ గా నిలుస్తాయి. అవి కమర్షియల్ గా హిట్ అయినా కాకపోయినా అందులో ఉన్న కంటెంట్ కి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాంటి సినిమాల టాక్ జనాలకి రీచ్ అయ్యే సరికి అవి థియేటర్లలోంచి ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఓటీటీ లోనో టీవీ లోనో చూసే అవకాశం వస్తుంది. ఇపుడు అలాంటి మరొక సినిమా సిద్ధం అయినట్టు అనిపిస్తుంది. పృథ్వీ దండమూడి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం’ IIT కృష్ణమూర్తి’, ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదల అయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా స్పెషల్ గా నిలవబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
ఐఐటి బొంబాయి లో చదువుతున్న ఒక అబ్బాయి తన బాబాయి కనపడుటలేదు అని హైదరాబాద్ కి వచ్చి వెతుకుతూ ఉంటాడు. అప్పటిదాకా మిస్సింగ్ మిస్టరీ అనుకున్న కథ కాస్త అది మర్డర్ మిస్టరీ అని తెలుస్తుంది. తన బాబాయ్ చావు నార్మల్ కాదు అని అది హత్య అని అది ఛేదించడానికి హీరో ప్రయత్నిస్తుంటే వచ్చే అవరోధాలు దాన్ని హీరో ఛేదించిన విధానం మిగతా కథ అని ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. ట్రైలర్ వరకు చూసుకుంటే సినిమా పైన ఆసక్తి కలిగేలా వుంది. ప్రేమ్ కుమార్ సమర్పణలో క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ నేకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. శ్రీవర్ధన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.