లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి షాకిచ్చారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పాత పాటలను అనుమతి లేకుండా వాడారంటూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుండగా, ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మూవీలో ఉపయోగించిన మూడు తమిళ పాటలను వెంటనే తొలగించాల్సిందిగా, అలాగే ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఇళయరాజా లాయర్లు డిమాండ్ చేశారు. ఇందులో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా పేర్కొన్నారు. ఈ పాటలు థియేటర్‌లో పెద్ద హైప్ సృష్టించడంతో ఇష్యూ మరింత ప్రాముఖ్యత పొందింది.
ఇళయరాజా గతంలోనూ ఇలాంటివే పలు సందర్భాల్లో చేశారన్నది గుర్తుంచుకోాలి. ప్రముఖ గాయకులు కూడా ఆయన నోటీసుల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మైత్రీపై ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నదే ఆసక్తికరం.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పటికే రూ.152 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఇలాంటి టైంలో ఇళయరాజా వివాదం డామేజ్ చేసే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే మైత్రీ సంస్థ ఈ పాటల హక్కులపై క్లారిటీ ఇస్తే సమస్య వీడే అవకాశం ఉంది. లేదంటే కోర్టు చుట్టూ తిరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.