బాలీవుడ్: టాలీవుడ్ లో దేవదాస్ అనే సినిమా ద్వారా 2005 లో సినీ ప్రయాణం ప్రారంభించిన గోవా బ్యూటీ ఇలియానా. ఇక్కడ టాప్ హీరోలందరితో సినిమాలు తీసి సక్సెస్ రుచి చూసి బాలీవుడ్ వైపు అడుగులేసింది. అక్కడ కూడా కొన్ని హిట్ లు ప్లాప్ లతో ప్రయాణం కొనసాగించింది. అయితే ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. కానీ మళ్ళీ తాను ఆఫర్ల వేటలో పడి మరొక సినిమా తన పాకెట్ లో వేసుకుంది. సౌత్ లో కూడా సినిమాలు ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎట్టకేలకు బాలీవుడ్ లోనే మరొక ఆఫర్ సంపాదించింది ఇలియానా.
తాను నటించబోయే సినిమా పేరు ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ మరియు మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రణ్ దీప్ హుడా హీరోగా నటించే ఈ చిత్రానికి బల్విందర్ సింగ్ జనువా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వివరాలను ఈ రోజు ప్రకటించారు. సోనీ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. మన సమాజంలో ఉన్న ‘వర్ణ వివక్ష’ లాంటి అంశాన్ని సందేశాత్మకంగా కాకుండా ఒక మంచి వినోదాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా అని.. సినిమా కథ చాలా హ్యూమరస్ గా ఉంటుందని ఇలియానా తెలిపింది.