ముంబై: భారత దేశం లో సంగీత ప్రస్తావన వచ్చినపుడు అందులో ముఖ్యులుగా చెప్పుకునే పేర్లు కొన్ని ఉంటాయి. వారిలో లతా మంగేష్కర్ ఒకరు. అలాంటి లతా మంగేష్కర్ గారు ఒక యువ గాయని ఆలాపనకి ముగ్దురాలు అయ్యి ఆ యువ గాయని పాడిన పాటని తన ట్విట్టర్ హేండిల్ ద్వారా షేర్ చేసారు.
పాశ్చాత్య సంగీతంలో మొజార్ట్ ఒక శిఖరం. ఆయన స్వరపరిచిన సింఫనీలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులకు నిత్యం స్ఫూర్తినిస్తుంటాయంటే అతిశయోక్తి కాదు. అయితే, మొజార్ట్ వెస్ట్రన్ బాణీలకు భారతీయ శాస్త్రీయ సంగీత స్వరాలను జతచేసి ఓ అమ్మాయి అద్భుతంగా పాడుతుంది. ఆ అమ్మాయి పేరు సమదీప్త ముఖర్జీ, లతా మంగేష్కర్ ను సైతం ముగ్ధురాలిని చేసింది. సమదీప్త ముఖర్జీ గానానికి తాను మైమరచిపోయానని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఆ అమ్మాయి తప్పకుండా మంచి గాయని అవుతుందని దీవించారు. అంతేకాదు, సామదిప్తా ముఖర్జీ వీడియోను కూడా పంచుకున్నారు.
ఈ ట్వీట్ కి రిప్లై గా సమదీప్త ముఖర్జీ కూడా స్పందించారు. ఈ అభినందన తో తన కల సాకారం అయినట్టు అనిపిస్తుందని. భారత రత్న దగ్గరనుండి ఇంత విలువైన ప్రశంసలు లభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.