అలస్కా: INTO THE WILD – ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా అంటే ఒక ప్రత్యేక అభిమానం.
1992 లో 24 ఏళ్ళ అడ్వెంటరిస్ట్ క్రిస్ మేక్ కండ్లెస్ తన చివరి రోజుల్లో ఒక బస్సు లో ఉంటాడు, చివరికి ఆకలి తట్టుకోలేక మరణిస్తాడు. ఈ కథ ని ఆధారం గ చేసుకొని INTO THE WILD అనే బుక్ మరియు సినిమా వచ్చాయి. జీవితం యొక్క విలువని తెలియ చేసే ఈ కథ 1996 లో బెస్ట్ సెల్లింగ్ బుక్ అలాగే 2002 నుండి ఇప్పటివరకు చాలామంది వాచ్ లిస్ట్ లో ఉండే మూవీ. ఇది ఒక యదార్ధ కథ ఆధారంగా రచించిన నవల/సినిమా. ఈ సినిమా చూసిన లేదా ఆ బుక్ చదివిన చాలా మంది ఔత్సాహికులు ట్రెక్స్ చేసేవాళ్ళు ఆ బస్సు ఉన్న ప్రదేశానికి చేరుకునే ప్రయత్నం లో ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సు ని చేరుకునే ప్రయత్నం లో చాల మంది టూరిస్ట్స్ ని అక్కడి గవర్నమెంట్ రెస్క్యూ చేసి కాపాడాల్సి వస్తుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందు రోజుల్లో ఇది ఇంకా ప్రమాదకరం అవుతుంది అనే ఉద్దేశ్యం తో అక్కడి గవర్మెంట్ మిలట్రీ హెలికాప్టర్స్ ని వాడి ఆ బస్సుని అక్కడి నుండి తరలించడం జరిగింది. అలస్కా నుండి 50 కమ్ దూరం లో ఉన్న దట్టమైన అడవిలో ఉన్న ఈ బస్సు ని టూరిస్ట్స్ సేఫ్టీ దృష్ట్యా అక్కడి నుండి తరలించారు.