హైదరాబాద్: పద్మ శ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు అల్లు ఫామిలీ. అనుకున్నదే తడవుగా పూజా కార్యక్రమాలు చేసి స్టూడియో నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు అల్లు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, అతని పెద్ద కుమారుడు వెంకటేష్ , అల్లు అర్జున్ (బన్నీ) , అల్లు శిరీష్ , కోడళ్ళు, మనవరాళ్లు, మనవళ్లు విచ్చేసి కుటుంబ సమేతంగా పూజ్య కార్యక్రమాలతో స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగా ఫామిలీ నుండి ఎవరూ హాజరు కాలేదు. వీరితో పాటు అల్లు వారి నమ్మకస్తులైన బన్నీ వాసు మరియు ఇంకొందరు ప్రొడక్షన్ హౌస్ టీం అటెండ్ అయ్యారు.
గీత ఆర్ట్స్ తో ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి దాదాపు ముప్పై సంవత్సరాలుగా విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ, దానికి కొనసాగింపుగా GA2 బ్యానర్ పై చిన్న సినిమాలని ప్రోత్సహిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా రాణిస్తూ, చివరి సంవత్సరం ఆహా అనే ఓటీటీ ప్రారంభించి దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు అల్లు వారి టీం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియాలిటీ షోస్ కి, సినిమా షూటింగ్ లకి, సీరియల్స్ కి ఇలా రకరకాల కారణాలకి స్టూడియోస్ అవసరం వస్తున్నాయి అనే పరిస్థితి ని ఉద్దేశించి స్టూడియో ప్లాన్ చేస్తున్నారు అల్లు వారు. ఇప్పుడు ఉన్న స్టూడియోస్ అన్నీ పాతవి అవడం వీళ్ళకి కలిసొచ్చే అంశం. వీళ్ళ స్టూడియో ప్లాన్ కొత్తగా అనిపిస్తే డిమాండ్ బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటిలానే ఇందులోకూడా అల్లు అరవింద్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.