సిడ్నీ: Ind vs Aus మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇన్నాళ్ళు కొనసాగిన ఊహాగానాలను నిజం చేస్తూ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుండి తప్పుకున్నారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే బూమ్రా పగ్గాలు తీసుకున్నారు.
రోహిత్ శర్మ స్వచ్చంధంగానే ఈ మ్యాచ్ కు రెస్ట్ తీసుకున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి.
మరి చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఎలా ఆడుతుందో చూడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.
అలాగే డబ్లూటీసీ ఫైనల్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓడిపోతే భారత్ ఫైనల్ నుండి నిష్క్రమించినట్లే.