fbpx
Monday, March 3, 2025
HomeBig StoryInd vs nz: టీమిండియా విజయం.. సెమీస్‌లో ఆసీస్‌తో పోరు!

Ind vs nz: టీమిండియా విజయం.. సెమీస్‌లో ఆసీస్‌తో పోరు!

ind-vs-nz-champions-trophy-2025-semi-finals-australia

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అజేయంగా ముందుకెళ్తోంది. న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్, సెమీఫైనల్‌కు అగ్రస్థానంతో చేరింది. దాంతో, మార్చి 4న జరగనున్న సెమీస్‌లో ఆసీస్‌తో భారత్ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా, మిగిలిన వారు మద్దతివ్వలేదు.

లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. కేన్ విలియమ్సన్ (81) ఒక్కడే పోరాడినా, మిగతా ఆటగాళ్లు కనీస స్కోర్ చేయలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అదరగొట్టగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటై, టాప్ లో నిలవలేకపోయింది. స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడే టీమిండియా, ఆ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. మరి, ఫైనల్ బెర్త్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక న్యూజిలాండ్, మరో సేమి ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టనుంది.

india, champions trophy, semi final, australia, cricket,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular