లండన్: సమాజ నిర్మాణంలో మెరుగైన పాత్రలో ముందు ఉండే ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి. అలాంటి గురువులకు వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి మందిని పైగా ప్రశ్నించారు.
మీరు మీ టీచర్లను విశ్వసిస్తున్నారా, లేదా? వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా, లేదా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా, కాదా? అని తదితర ప్రశ్నలు సంధించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి.
విద్య్ బుద్ధులు చెప్పి జీవితంలో మార్గదర్శకులు గా ఉండే ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ చెప్పారు. భారత్‌లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యపై 14 శాతం ఖర్చు పెడుతోంది. రెండో స్థానంలో నిలిచిన ఘనాలో 22.1 శాతాన్ని విద్యపై వెచ్చిస్తున్నారు అని నివేదిక తెలిపింది.