న్యూఢిల్లీ: దేశంలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిని ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది.
కాగా పంజాబ్ లోని జలంధర్ నియోజకవరంలో ఆప్ అభ్యర్థి 37,325 ఓట్లా తేడాతో గెలుపొందారు. బెంగాల్ లోని 4 స్థానాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, హిమాచల్ లో 2, మధ్యప్రదేశ్ లో 1, ఉత్తరాఖాండ్ లో 2 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
బీహార్ రాష్ట్రంలోని రూపాలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి, హిమాచల్ లోని హమీర్ పూర్ లో మాత్రమే ఎన్డీయే ముందంజలో ఉంది. సాయంత్రానికి మొత్తం ఫలితాలు వెలువడనున్నాయి.