పూణే: ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ తొలి మ్యాచ్ లో 66 పరుగుల తేడాతో గెలుపొంది విజయంతో ప్రారంభించి సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. భారత్ ఆల్రౌండ్ ప్రతిభతో తొలి మ్యాచ్ ను గెలుపొందింది. అంతర్జాతీయ మ్యాచ్ లో అరగేట్రం చేసిన కృనాల్ పాండ్యా బ్యాట్ తో బాల్ తో ఆకట్టుకొని తన సెలక్షన్ కరెక్ట్ అని నిరూపించుకున్నాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 317 భారీ స్కోరును సాధించింది. కోహ్లీ, ధావన్, కృనాల్, రాహుల్ యొక్క బ్యాటింగ్ మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ చేజింగ్ చాలా ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్ కు రాయ్, బైర్స్టో 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ కు దాదాపుగా విజయాన్ని దూరం చెసినంత పని చేశారు. అయితే వాళ్ళు ఇద్దరు అవుటయ్యాక ఇక ఇంగ్లాండ్ పతనం ఆరంభమైంది.
బౌలింగ్ లో భువనేశ్వర్ 3 వికెట్లు, అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ 4 వికెట్లు, శార్దూల్ 2 వికెట్లు, కృనాల్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిం భారత్ కు తొలి విజయాన్ని అందించారు.