చెన్నై: చెన్నై లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 317 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీసుకుని సిరీస్ ను 1-1 తో సమం చేసింది. 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో లంచ్ విరామానికి వెళ్లిన ఇంగ్లండ్ బ్రేక్ అనంతరం 164 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో మొయిన్ అలీ 43 పరుగులతో టాప్ స్కోర్‌రగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటగా, అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్ టెస్టుకు ఆత్మవిశ్వాసంతో వెళ్తుంది.
లంచ్ విరామం అనంతరం ఇంగ్లండ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 49వ ఓవర్‌లోనే ఎనియిదో వికెట్ కోల్పోగా.. మరోసారి అక్షర్ బౌలింగ్‌లోనే ఓలీ స్టోన్ ఎల్బీగా వెనుదిరగడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. లంచ్ అనంతరం రెండు వరుస ఓవర్లో రెండు వికెట్లు తీసిన అక్షర్ 5 వికెట్లు సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించిన 6వ బౌలర్‌గా అక్షర్ పటేల్ ఘనత సాధించాడు.
చెన్నై రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెపర్ శుభ్‌మన్ గిల్ ఎడమ మోచేతికి గాయమైంది. మూడోరోజు ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గిల్ ఎడమ మోచేతికి వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ నేపథ్యంలో గాయం కారణంగా గిల్ ఈరోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్యుల బృందం అతడిని పర్యవేక్షించారు.