జైపూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగించినప్పటీకీ చివరకు 6 వికెట్లకు 164 పరుగులు చేసింది.
చేజింగ్ ఆరంభించిన భారత్ కు రోహిత్ రాహుల్ శుభారంభాన్నే ఇచ్చారు. రోహిత్ ధాటిగా ఆడడం వల్ల భారత్ పవర్ ప్లే ముగిసేలోపే 50 పరుగులు చేసింది. తరువాత రాహుల్ 15 పరుగులకే అవుటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ రోహిత్ తో కలిసి అధ్బుతంగా ఆడాడు. కళ్ళు చెదిరే షాట్లతో అలరించాడు.
రోహిత్ 48 పరుగులకు అవుటవ్వగా సూర్య కుమార్ 62 పరుగులు చేసి అవుటయ్యాడు. తరువాత భారత్ వెనువెంటనే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ల వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ లో పరుగులు చేయల్సిన స్థితికి వచ్చింది. వెంకటేష్ అయ్యర్ ఒక 4 కొట్టి అలరించినా వెంటనే అవుటయ్యాడు. 4 కొట్టి రిషబ్ భారత్ కు విజయాన్ని అంధించాడు.
కాగా పూర్తి స్థాయి కెప్టెన్ గా మొదటి మ్యాచ్ ఆడిన రోహిత్ విజయంతో మొదలు పెట్టాడు. అయితే మ్యాచ్ తరువాత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ అనుకున్నంత సులువుగా మ్యాచ్ గెలవలేదు. ఆటగాళ్ళు దీనిని ఒక అనుభవంగా స్వీకరించాలని అన్నాడు.