మొహాలీ: ఇటివల స్వదేశంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయాల ద్వారా వన్డే టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.
తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా సరికొత్త రికార్డును సృష్టించాడు రోహిత్ శర్మ. పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్ తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన రెండవ భారత సారథిగా నిలిచాడు. అంతకు ముందు పాలీ ఉమ్రిగర్ ఈ ఘనత సాధించాడు.
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(175 పరుగులు నాటౌట్, 9 వికెట్లు)గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 పరుగులు చేశాడు.