పల్లికెలి: శ్రీలంకతో తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్లు దూకుడు గా ఆడడంతో భారీ స్కోరు చేసింది. 213/7 తో ఇన్నింగ్స్ ముగించి, 214 పరుగుల టార్గెట్ ను లంక ముందుంచింది.
భారత్ బ్యాటింగ్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ(58) చేశారు. రిషబ్ పంత్ 49, యశస్వీ జైస్వాల్ 40, శుభ్మన్ గిల్ 34 మెరుపులతో భారత్ భారీ స్కోరు చేసింది.
చేజింగ్ కి దిగిన లంక ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కానీ, 140 పరుగులకు 2 వికెట్లతో ఉన్న స్థాయి నుండి 170 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
లంక బ్యాటర్లలో నిస్సాంక 79 పరుగులు చేయగా, కుశాల్ మెండిస్ 45 పరుగులు చేశారు. వీరు మినహా ఇక మిగతా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచారు.