హరారే: జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ లో మూడవ టి20లో కూడా భారత్ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
టాస్ గెలిచి బ్యాటీంగ్ ఎంచుకున్న భారత్ 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎట్టకేలకు చాలా రోజుల తరువాత హాఫ్ సెంచరీతో రాణించాడు. గిల్ 60 పరుగులు చేసి అవుటవ్వగా, రుతురాజ్ గైక్వాడ్ 49, యశస్వి జైస్వాల్ 36 పరుగులతో రాణించారు.
ఛేధనకు దిగిన జింబాబ్వే తరఫున మయర్స్ 65, క్లైవ్ 37 పరుగులు తప్ప మిగతా అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 159 పరుగ్లు మాత్రమే చేశి 23 పరుగుల తేడాతో మ్యాచ్ లో ఓటమి పాలైంది.
భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసి జింబాబ్వేని ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. 4వ మ్యాచ్ శనివారం అనగా 13వ తేదీ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.