న్యూఢిల్లీ: భారత్‌లో 3 నెలలు పాటు విరుచుకుపడ్డ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. కాగా గత 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 1,422 మంది మృతి చెందారు. ఈ మరణాలతో మొత్తం కరోనా వైరస్ బారినపడి 3,88,135 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
అలాగే గడచిన 24 గంటల్లో 78,190 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,844,199 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,02,887 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 28,00,36,898 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆదివారం దేశం మొత్తం మీద 47 లక్షల మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 13.59 లక్షల మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి రికార్డు నెలకొల్పింది.