అంతర్జాతీయం: అమెరికా-చైనా మధ్య వాణిజ్య తగాదాలు భారత్‌కు అవకాశాలుగా మారుతున్నాయి. చైనాపై అమెరికా విధిస్తున్న 65%కు పైగా సుంక భారం.. భారత ఉత్పత్తులపై మాత్రం కేవలం 27% సుంకమే ఉండడంతో, గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌కు పోటీదారుల కంటే అడ్వాంటేజ్ ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటిది ఎలక్ట్రానిక్స్, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు వంటి రంగాల్లో స్పష్టంగా కనిపించనుంది. EY ఇండియా ట్రేడ్ పాలసీ లీడర్ అగ్నేశ్వర్ సేన్ మాట్లాడుతూ, “ఇతర దేశాలకు ధీటుగా భారత్ ఉత్పత్తులు నిలుస్తాయి. సరైన సప్లై చైన్‌తో వృద్ధి సాధ్యమే” అని పేర్కొన్నారు.
2023లో భారత్ అమెరికాకు 10 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతి చేసింది. ICEA అంచనాల ప్రకారం, పాలసీ సపోర్ట్ ఉంటే ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.
అమెరికాతో వ్యాప్తి చెందిన ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా భారత్‌కు మరింత లాభం చేకూరుతుందని ICEA చైర్మన్ పంకజ్ మొహింద్రూ అభిప్రాయపడుతున్నారు. EV మార్కెట్లోనూ భారత్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
2023లో చైనా ఆటో ఎగుమతులు 17.99 బిలియన్ డాలర్లు కాగా, భారత్‌ది కేవలం 2.1 బిలియన్లే. ఇది పీఎల్ఐ ద్వారా మెరుగుపడాల్సిన రంగమని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా సుంకాలు భారత మార్కెట్‌కు బలంగా అనుకూలించాయి. దీన్ని పురోగతి మార్గంగా మార్చుకుంటే భారత్ ఎగుమతుల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.