చెన్నై: రేపటి నుండి బంగ్లా తో భారత్ తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా ఇటీవల పాకిస్తాన్ ను వైట్ వాష్ చేసిన జోష్ లో ఉన్న బంగ్లా భారత్ పై కూడా అలాంటి ఫలితం రావాలని ఆశిస్తోంది.
అయితే భారత్ పై మరి బంగ్లా ఎటువంటి ఆటతీరు ప్రదర్శిస్తుందో చూడాలి. కాగా 258 రోజుల తరువాత రోహిత్, కోహ్లీ, బూమ్రా కలిసి ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ ఇదే.
కోచ్ గౌతం గంభీర్ భారత్ ఆటగాళ్ళపై నమ్మకుం ఉందని, టీం లో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారని అన్నారు.
భారత్ క్రికెట్ టీం అంటే ఒకప్పుడు బ్యాటర్ల పైనే ఎక్కువ అభిమానం ఉండేదనిం, అయితే బూమ్రా, అశ్విన్, జడేజా ఆ ధోరణిని మార్చి బౌలర్లపై కూడా నమ్మకాన్ని పెంచారన్నారు.
ఇక బంగ్లాతో జరిగే టెస్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఈ మ్యాచ్ కోసం ఇప్పటీకె స్టార్ ఆటగాళ్ళు రోహిత్, విరాట్ కోహ్లీ అందరు చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
తుది జట్టులో ఎవరెవరు ఉండనున్నారనేది రేపాటికి తేలిపోతుంది.