న్యూఢిల్లీ: దేశంలో ఇంకా కరోనా భీభత్సం ఆగట్లేదు. ఐదో రోజు కూడా వరుసగా దేశంలో 3లక్షలకు పైగా కరోనా పాఝిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండడం ఈ ఉధృతికి నిదర్శనం. గత 24 గంటల్లో దేశం మొత్తం మీద 3,54,653 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 2,808 దీని బారిన పడి మరణించారు.
ఇదిలా ఉంటే నిన్న 2,19,272 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం. దీంతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 1,73,13,163గా చేరగా, మరణించిన వారి సంఖ్య 1,95,123 కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు టీకాలు పొందినవారి సంఖ్య 14,19,11,223కి చేరుకుంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో 66,191 కేసులతో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అలాగే మరణాల సంఖ్య 832గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 22,933 కేసులు నమోదు కాగా, 350 మంది కరోనాతో చనిపోయారు.
ఇక మిగతా రాష్ట్రాలు అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళలో 28,469, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది.