న్యూఢిల్లీ: భారత్ చైనా మొబైల్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఇక నుండి చైనా దేశం నుంచి దిగుమతి జరిగే అన్ని స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన తయారీ పూర్తి వివరాలను భారత దేశానికి సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల ఇకపై సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కాంపోనెంట్లను వినియోగిస్తున్నారో అనే పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని నోటీసుల్లో భారత్ పే ర్కొంది.
కాగా ఇంత వరకు చైనా కంపెనీలు ఇంతవరకు ఈ పని చేయనే లేదు. ఈ విషయంపై చాలా వరకు దేశాలకు చైనా పై పలు అనుమానాలున్నాయి. దీనితో పాటు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
భారత్‌లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ట్ ఓ కథనం ప్రచురించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డాటా ప్రకారం, మన దేశపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది.
భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్‌ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.