ముంబై: దాదాపు రెండు నెలలు అలరించిన ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమయింది. తెంబా బవుమా కెప్టెన్సీలోని ప్రొటిస్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కాగా భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌తో మొదటిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం చేయనుండగా, అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా కాలం తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడు.
ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈ సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది. ఆసక్తిరేపుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్, వేదికలు, ఇరు జట్ల వివరాలు ఇక్కడ:
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ
రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్
మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్
ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
నోట్: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి.
ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
దక్షిణాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.