జాతీయం:భారతదేశం AI రంగంలో ముందంజలోకి – ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్
భారతదేశం కంప్యూటర్ సాంకేతికతలో ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లోనూ తన ప్రతిభను చాటుకోనుందని ఎన్విడియా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ఎన్విడియా AI సమ్మిట్‌లో హువాంగ్ మాట్లాడుతూ, భారతదేశం భవిష్యత్తులో శక్తివంతమైన AI సొల్యూషన్లను ప్రపంచానికి ఎగుమతి చేయగల దేశంగా ఎదగబోతోందని వివరించారు.
AI విస్తరణలో భారత్ పాత్ర
భారతదేశం ఇప్పటికే కంప్యూటర్ రంగంలో ద్రువీకరణ పొందినప్పటికీ, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు కేంద్రంగా నిలిచిందని హువాంగ్ ప్రశంసించారు. అలాగే, AI టెక్నాలజీలోనూ భవిష్యత్తులో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, AI సొల్యూషన్లలో దేశం శక్తివంతమైన ప్రదాతగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం గతంలో సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచానికి ఎగుమతి చేసిన విధంగా, AIని కూడా అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసి ఇతర దేశాలకు సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన దేశంగా నిలుస్తుందని చెప్పారు.
ఉద్యోగాలకు AI ముప్పేమీ లేదు
AI పుణ్యమా అని ఉద్యోగాలు పూర్తిగా నశించిపోవని హువాంగ్ స్పష్టం చేశారు. ఉద్యోగాల స్వరూపం మారవచ్చని, AI టెక్నాలజీకి అనుగుణంగా కొత్త తరహా ఉద్యోగాలు అవతరించవచ్చని పేర్కొన్నారు. AI ప్రోగ్రామింగ్, మేనేజ్‌మెంట్, డేటా అనలిసిస్ వంటి రంగాలలో AI కో-పైలట్‌లా ఉద్యోగులను తోడ్పడే సాధనంగా మారుతుందని హువాంగ్ వివరించారు.
AI సదుపాయాలు అందరికీ
ప్రతిఒక్కరికీ AI సాధనాలు అందుబాటులోకి రావడంతో ఉద్యోగ ప్రక్రియలో మార్పులు అనివార్యం కావచ్చని, ఇది వ్యక్తుల సామర్థ్యాలను పెంపొందించడంలో కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్ణయాత్మక మద్దతు
AI రంగంలో భారత్ కీలకమైన ప్రాముఖ్యతను సంపాదించడానికి ఎన్విడియా కంపెనీ తమ ఎకోసిస్టమ్‌ను విస్తరించేందుకు కట్టుబడి ఉందని హువాంగ్ వెల్లడించారు. AI టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌కి శక్తివంతమైన మద్దతు అందిస్తామని, ఈ రంగంలో మహా శక్తిగా ఎదిగేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని హువాంగ్ తెలిపారు.