టోక్య్: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడలో భారత మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్రను సృష్టించింది. భారత్ పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం గెలవడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరడంతో భావానీ బెన్ కు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది.
అయితే ఇవాళ జరిగిన ఫైనల్ పోరులో చైనా క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్‌వన్ చైనా క్రీడాకారిణి అయిన జౌ యింగ్ చేతిలో 3-0తో ఓటమి చవిచూసింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత దేశానికి మొట్టమొదటి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. ఆమె తన 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో పలు విజయాలు సాధించింది.
ఇక మరో వైపు టోక్యో పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన పురుషుల హైజంప్ (టీ46/47) విభాగంలో భారత్ యొక్క నిషాద్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. ఇవాళ జరిగిన ఈ హైజంప్ పోటి ఫైనల్ మ్యాచ్ లో అతను 2.06 మీటర్ల దూకడంతో నిషాద్ కుమార్ తన స్వంత ఆసియా రికార్డును సమం చేసుకున్నాడు.