మాలేషియా: భారత అండర్-19 మహిళల జట్టు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు, ఓపెనర్ల అద్భుత బ్యాటింగ్‌తో 19 ఓవర్లలోనే విజయం సాధించింది.
గొంగడి త్రిష (35) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, కమిలిని అర్ధశతకంతో రాణించింది. 47 బంతుల్లో 7 బౌండరీలతో 56 పరుగులు చేసిన కమిలిని, జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, భారత బౌలర్ల దాటికి 113 పరుగులకే పరిమితమైంది. పరునిక సిసోడియా (3/21), వైష్ణవి శర్మ (3/24) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
ఈ విజయంతో ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోటీపడనుంది. గతంలో మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ సేన దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు యువ మహిళల జట్టు అదే విజయ పథాన్ని అనుసరిస్తుందా అనే ఉత్కంఠ క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది.